
జైపూర్(భీమారం) వెలుగు: ఫారెస్ట్ అధికారులపై దాడికి యత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు భీమారం ఎస్సై శ్వేత తెలిపారు. భీమారం మండలంలోని మంచిర్యాల అటవీ రేంజ్ దాంపూర్ బీట్ అటవీ ప్రాంతంలోని వాగు నుంచి బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజ్ కుమార్, రాములు, అతడి సోదరులు శ్రీనివాస్, బలరాం, బంధువులు భూక్య అనిల్, దేవ్, రాజేశ్, ధరావత్ వంశీ మంగళవారం రాత్రి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.
అడ్డుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గడికొప్పుల బాణేశ్పై దురుసుగా ప్రవర్తించారు. ఆయన టూ వీలర్ ను ఢీకొట్టి ట్రాక్టర్ ను పట్టుకుపోయారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.