
బషీర్బాగ్, వెలుగు: ఛత్రపతి శివాజీ మహారాజ్ ను పలువురు సీపీఐ నాయకులు అవమానించారని రాష్ట్రీయ వానరసేన ఇచ్చిన ఫిర్యాదుతో 9 మందిపై నారాయణ గూడ పోలీసులు కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ లో జరిగిన బహిరంగ సభలో ఛత్రపతి శివాజీ చరిత్రను వక్రీకరించారని, శివాజీ ఫ్లెక్సీలో శూద్రుడు అని పెట్టినందుకు గత నెల 24న రాష్ట్రీయ వానరసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు సీపీఐ నాయకులు ఈటీ నరసింహ, వీఎస్. బోస్, ఎస్. ఛాయాదేవి, బి. స్టాలిన్, బి. వెంకటేశం, నీర్లకంటి శ్రీనివాస్, కంపల్లి శ్రీనివాస్, మహ్మద్. ఉమర్ ఖాన్, మామిడి చెట్ల వెంకటస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.