కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు

కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా.. 4వ నంబర్ కలిగిన టీ షర్ట్ ను ధరించి కాంగ్రెస్ కు ఓటేయాలంటూ రాజేందర్ రావు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ  బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై బీజేపీ కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు విచారణ జరిపి రాజేందర్ రావు పై కేసు నమోదు చేశారు.

కాగా, 17 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు  పోలింగ్ జరిగింది.  పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ల ఉన్న వారిక ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61.16శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.