ఆదిలాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోన్న మూసీ ప్రాజెక్టులో రూ.1.50 వేల కోట్ల స్కామ్ ఉందని.. అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ మేరకు ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. మురికి కూపంలో కూరుకుపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రూ.1.50 వేల కోట్లతో మూసీని తీర్చిదిద్దుతామని సీఎం, మంత్రులు ప్రకటించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ భారీ స్కామ్‌కు పాల్పడుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ఆత్రం సుగుణ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు అయ్యింది.
ALSO READ | మంత్రి కొండా సురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసు ఇద్దరు అరెస్ట్