చెట్లు నరికి అమ్ముకున్న సర్పంచ్

  • కేసు నమోదు.. రూ. 10వేలు ఫైన్​

నర్సింహులపేట, వెలుగు : చెట్లను నరికించి అమ్ముకున్న బీఆర్ఎస్ సర్పంచ్ పై కేసు నమోదు చేయడంతో పాటు ఫైన్ పడింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ పంచాయతీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు ఎలాంటి తీర్మానం లేకుండా  పాత చెరువు కట్టపై ఇరువైపులా ఉన్న ప్రభుత్వ చెట్లను నరికించి అమ్ముకున్నాడు. 

ఈ విషయం తెలియడంతో  ఫారెస్ట్, ఇరిగేషన్ ఆఫీసర్లు విచారణ చేశారు. సర్పంచ్ కు రూ. 10వేలు ఫైన్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేశారు.