
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలో బైక్ స్టంట్స్ చేస్తూ మహిళను భయపెట్టిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసాచారి తెలిపారు. కోఠి ఇసామియా బజార్ లో మంగళవారం ఉదయం ముగ్గురు యువకులు బైకులపై స్టంట్స్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న మహిళను భయభ్రాంతులకు గురిచేశారు.
అక్కడే ఉన్న అజయ్ కుమార్ తుల్షాన్ యువకులను అలా చేయడం సరికాదని సూచించడంతో దురుసుగా ప్రవర్తించి వెళ్లిపోయారు. అనంతంతరం అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు చాదర్ ఘాట్ కు చెందిన సయ్యద్ షోయబ్, ఎండీ.ఇర్ఫాన్ అలీ, మహమ్మద్ అక్బర్ గా గుర్తించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.