మద్యం మత్తులో 100కు కాల్.. కేసు నమోదు

మద్యం మత్తులో 100కు కాల్.. కేసు నమోదు

కుభీర్, వెలుగు: మద్యం మత్తులో 100కు కాల్​ చేసి పోలీసుల సమయం వృథా చేసిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. నిర్మల్​ జిల్లా కుభీర్ మండలం సౌంవ్లీ గ్రామానికి చెందిన రోహిత్ ​కుమార్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవీందర్ ​తెలిపిన వివరాల మేరకు.. సౌంవ్లీ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో మాలేగాం గ్రామ సమీపంలో రోడ్డుపై న్యూసెన్స్​ చేశారు.

ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న పెట్రో కార్​ సిబ్బంది దీపక్ సింగ్, ఆత్మరాం వారి వద్దకు చేరుకొని వారి స్వగ్రామం సౌంవ్లీకి పంపించారు. అయితే మద్యం మత్తులో నలుగురిలో ఒకరైన రోహిత్​ కుమార్​100 కాల్​ చేసి పోలీసులను తమ గ్రామానికి రావాలని న్యూసెన్స్​ చేశాడు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం, సమయం వృథా చేసినందుకు రోహిత్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అత్యవసర సమయంలో మాత్రమే 100 కాల్​ చేయాలని, అనవసరంగా కాల్​ చేసి విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.