వన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు.. ఐదుగురికి రిమాండ్

వన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు.. ఐదుగురికి రిమాండ్

వన్యప్రాణులకు హాని కలిగించే వారిపై అటవీ అధికారులు కొరడా ఝళిపించారు. నిర్మల్ జిల్లా   మామడ మండలం నల్దుర్తి తండా సమీపంలో నీలుగాయి మృతికి కారణమైన ఐదుగురు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. పంట చేనులో విద్యుత్ తీగలు అమర్చడంతో తీగలకు తగిలి నీలుగాయి మృతి చెందినట్లు అటవీ అధికారులు గుర్తించారు. నిందితులపై వన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. నీలుగాయి కళేబరం స్వాధీనం చేసుకున్నారు.