చైనా వ్యాక్సిన్లు వేసుకున్న దేశాల్లో మళ్లీ కేసులు

చైనా వ్యాక్సిన్లు వేసుకున్న దేశాల్లో మళ్లీ కేసులు

మంగోలియా, సీషెల్స్‌‌‌‌ లలో కరోనా విజృంభణ
వైరస్‌‌‌‌ వ్యాప్తికి, వ్యాక్సిన్‌‌‌‌ పనితీరుకు లింకేంటంటున్న డ్రాగన్‌‌‌‌ కంట్రీ

వాషింగ్టన్‌‌‌‌: చైనా వ్యాక్సిన్లు వాడిన దేశాల్లో జనం మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే 50 శాతం మందికి పైగా టీకాలు వేసినా కేసులు మళ్లీ ఎక్కువవుతున్నాయి. దీంతో త్వరలోనే కరోనా నుంచి బయటపడతామని అనుకున్న ఆ దేశాలు ఇప్పుడేం చేయాలో అర్థం కాక ఆగమవుతున్నాయి. డ్రాగన్‌‌‌‌ కంట్రీ వ్యాక్సిన్లు సినోఫామ్‌‌‌‌, సినోవాక్‌‌‌‌ ఎఫెక్టివ్‌‌‌‌ కాదని వార్తలు వస్తున్నాయి.
వారం రోజులుగా కేసులెక్కువైతున్నయ్‌‌‌‌
కరోనా వైరస్‌‌‌‌ రాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌‌‌‌ వేగవంతం చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను తమ ప్రజలకు దేశాలు ఇప్పిస్తున్నాయి. మంగోలియా, సీషెల్స్‌‌‌‌, బహ్రెయిన్‌‌‌‌ దేశాలు ఎక్కువగా చైనా వ్యాక్సిన్‌‌‌‌పై ఆధారపడ్డాయి. సినోఫార్మ్‌‌‌‌ ఎఫికసీ 78 శాతం, సినోవాక్‌‌‌‌ది 51 శాతంగా ఉన్నా వాటివైపే మొగ్గు చూపాయి. మొత్తంగా చైనా వ్యాక్సిన్‌‌‌‌ను 90 దేశాలు దిగుమతి చేసుకున్నాయి. సీషెల్స్‌‌‌‌, చిలీ, బహ్రెయిన్‌‌‌‌, మంగోలియా దేశాల్లో 50 నుంచి 68 శాతం జనాభాకు ఇప్పటికే చైనా వ్యాక్సిన్‌‌‌‌ వేశారని లెక్కలు చెబుతున్నాయి. కానీ గత వారం రోజులుగా కేసులు ఎక్కువవుతున్న టాప్‌‌‌‌ 10 దేశాల్లో ఇవి ఉన్నాయి.   
ఇజ్రాయెల్‌‌‌‌లో తక్కువ.. మంగోలియాలో ఎక్కువ
వ్యాక్సినేషన్‌‌‌‌లో రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్న ఇజ్రాయెల్‌‌‌‌లో 10 లక్షల మందికి దాదాపు 5 కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ 90% పనితనం ఉన్న ఫైజర్‌‌‌‌ టీకాను ప్రజలకు పంపిణీ చేశారు. మరోపక్క చైనా సినోఫామ్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ వేసుకున్న సీషెల్స్‌‌‌‌లో 10 లక్షలకు 716 కేసులు రికార్డవుతున్నాయి. మంగోలియాలో 52% మందికి చైనా టీకా వేశారు. అక్కడ ఆదివారం అక్కడ 2,400 కేసులు నమోదయ్యాయి. కిందటి నెలతో పోలిస్తే కేసులు 4 రెట్లు పెరిగాయి. ఇండినేసియాలో సినోవాక్‌‌‌‌  ఫుల్‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌‌‌ చేయించుకున్న 350 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. వాళ్లలో 61మంది ప్రాణాలు కోల్పోయినట్లు మెడికల్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ వెల్లడించింది.
కేసులు పెరుగుతున్నా వెనకేసుకొస్తున్నయ్‌‌‌‌
కేసులు పెరుగుతున్నా మంగోలియా, సీషెల్స్‌‌‌‌ మాత్రం సినోఫార్మ్‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌ బాగా పనిచేస్తోందని చైనాను వెనకేసుకొస్తున్నా యి. వ్యాక్సిన్‌‌‌‌ వేసినా జనాలు ఎక్కువగా గుమికూడటం, పట్టనట్టు వ్యవహరించడం వల్ల కేసులు పెరుగుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. ఇంకొందరేమో కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం చైనా టీకాలకు లేకపోవచ్చంటున్నారు. చైనా కంపెనీలు కూడా ఈ విషయంపై స్పష్టతనివ్వలేదు. చైనా మాత్రం కొత్త కేసులకు, తమ వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధమేంటని ప్రశ్నిస్తోంది. చాలా దేశాల్లో అవసరమైనంత మేర వ్యాక్సినేషన్‌‌‌‌ జరగలేదని డబ్ల్యూహెచ్‌‌‌‌వో చెప్పిందని గుర్తుచేసింది. తమ వ్యాక్సిన్‌‌‌‌ కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకుంటాయో ఇప్పటివరకు డేటాను చైనా కంపెనీలు విడుదల చేయలేదు.