నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిత్యం మార్నింగ్, ఈవెనింగ్వేళల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపడుతున్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా, ట్యాంపరింగ్ చేసినా, వంచినా, నంబర్స్ క్లియర్‌గా లేకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ తాలూకూ కేసులు 49 వేలకు పైగా నమోదవడం గమనార్హం. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌తో మొదటి సారి దొరికితే వాహనదారులు సరి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అదే రిపీట్చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పలువురికి శిక్ష, ఫైన్
నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చూస్తూ రెండో సారి పట్టుబడిన ఆరుగురు నిందితులకు కోర్టు మూడు నుంచి అయిదు రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది. అత్యధికంగా వీరికి రూ.5 వేల ఫైన్ వేశారు.