మోహన్ బాబు నెక్ట్స్ చేయబోతోంది ఇదే.. రిపోర్టర్ను కొట్టినందుకు ఇదే జరగబోతోంది..!

మోహన్ బాబు నెక్ట్స్ చేయబోతోంది ఇదే.. రిపోర్టర్ను కొట్టినందుకు ఇదే జరగబోతోంది..!

హైద్రాబాద్, వెలుగు: మంచు ఫ్యామిలీ గొడవ ఇప్పట్లో తేలేలా లేదు. చినికి చినికి గాలివానగా మారిన ఈ వ్యవహారం చివరికి పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. తండ్రి, కొడుకుల మధ్య జరిగిన గొడవలో మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. మీడియాపై చేయి చేసుకున్నందుకు మోహన్ బాబుపై 118 Bns కింద మూడు కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం రాచకొండ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 

Also Read :- మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే

చికిత్స పొందుతున్న మోహన్ బాబు.. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల

మంగళవారం తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం రాత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. బుధవారం 10 గంటల తర్వాత ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. అయితే ఉదయం పదిన్నర గంటలకు రాచకొండ కమిషనర్ కార్యాలయంలో హాజరు కావాలనే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.