
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన ఫోటోల మార్ఫింగ్ సంచలనం రేపుతోంది. పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేసినవారిపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఫోటో మార్ఫింగ్ పై తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనసేన కార్యకర్తలు.
పవన్ కల్యాణ్ ఇటీవల భార్య అన్నా లెజినోవా, కొడుకు అకీరా నందన్‌తో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తీసిన కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పవన్ పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు జనసైనికులు.
జగనన్న సైన్యం పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటోలు అసభ్య మార్ఫింగ్ పై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయ్యింది. చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టాడంటూ మరో కేసు నమోదయ్యింది. ఆ మధ్య వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వరుసగా అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోల కేసులో ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.