
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 20 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ బి. రోహిత్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ –10లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 22 మంది బాలలను గుర్తించి, వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో ఐదు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకునే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.