ఘట్ కేసర్, వెలుగు: బాల కార్మికులతో పనులు చేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేశారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్ .సైదులు తెలిపిన ప్రకారం... ఘట్ కేసర్ లోని ఎస్ఆర్ఎం మెకానికల్ ఎంటర్ ప్రైజెస్ షాప్, శివారెడ్డిగూడలోని ఏ వన్ యూసీవీసీ విండోస్ షాపుల ఓనర్లు ఇద్దరు బాలలతో పనులు చేయిస్తున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ టీం మిట్ట పద్మ, టీమ్ ఇన్ చార్జ్ ఎస్ఐ కొండలు గురువారం రిస్క్ చేసి ఇద్దరు బాలురను పట్టుకున్నారు. షాపు ఓనర్లు షేక్ అసిస్, మహ్మద్ గుర్ఖాన్ పై కేసు నమోదు చేశారు.