చెట్లు నరికితే కేసులు

చండ్రుగొండ/జూలూరుపాడు, వెలుగు : అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్లను ధ్వంసం చేసినా,  కొత్తగా పోడు నరికినా పీడీ యాక్టు పెడతామని కొత్తగూడెం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(ఎఫ్ డీవో) కోటేశ్వరావు హెచ్చరించారు. గురువారం జూలూరుపాడు రేంజ్ పరిధిలోని రాజారావుపేట, వినోభనగర్, చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులోని అటవీ ప్రాంతంలోని ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు నరికితే ఎఫ్ఆర్ వో పట్టాలు వస్తాయని ఎవరైనా ప్రోత్సహించినా, పోడు నరికినా శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటలు నాశనం చేస్తున్నాయని జంతువుల కోసం ఉచ్చులు, కరెంట్ తీగలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. ఆయన వెంట చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య, సెక్షన్ ఆఫీసర్ రాములు ఉన్నారు.