సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో గర్నమెంట్రూల్స్ ప్రకారం మోతాదుకు మించి ఇథిలిన్ వాడుతున్న మామిడి ట్రేడర్స్ పై కేసులు నమోదు చేస్తున్నట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఇన్చార్జి ఆఫీసర్ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని మామిడి ట్రేడర్స్ పై ఈ నెల 1న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి రూల్స్ విరుద్ధంగా ఇథలిన్ వాడుతున్న మామిడి శాంపిల్స్లను టెస్టింగ్ కోసం హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు.
ఈ నెల 25న రిపోర్ట్ లో మోతాదుకు మించి ఇథలిన్ వాడినట్లు తేలడంతో ఇరుమయ్యా, పాపా బుడే, షేక్ ఖాసీం, అబ్దుల్ కరీం మహమ్మద్ హాబీబ్ వ్యాపారస్తులపై క్రిమినల్ కేసు ఫైల్ చేసి చర్యలు కృష్ణమూర్తి వెల్లడించారు.