తాగి నడిపేవాళ్లు ఎక్కువయ్యారు: డ్రంక్ అండ్ డ్రైవ్ లో..10రోజుల్లో 16 వందల మందిపై కేసు

తాగి నడిపేవాళ్లు ఎక్కువయ్యారు: డ్రంక్ అండ్ డ్రైవ్ లో..10రోజుల్లో 16 వందల మందిపై కేసు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. రోజురోజుకు తాగి బండ్లు నడిపే వారి  సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. కేవలం పదిరోజులు నిర్వహిం చిన డ్రంక్ అండ్ డ్రైవ్  తనిఖీల్లో ఏకంగా 16 వందల మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.  

జూలై 1నుంచి జూలై  10 వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతున్న 1,614 మందిపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వివిధ కోర్టుల్లో మొత్తం 992 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారంటే.. నగరంవాసులు ఎంతలా తాగి  ఊగుతూ బండ్లు నడుపుతు న్నారో అర్థమవుతోంది.  అంతేకాదు.. వీరిలో 55 మందికి 15 రోజుల జైలు శిక్ష పడింది. 8మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు. మొత్తంగా తాగి బండ్లు నడిపిన మందుబాబు లనుంచి 21లక్షల 36వేల రూపాయల జరిమానాకూడా వసూలు చేశారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారంతా ఎక్కువా బైకర్లే ఉన్నారు. టూవీలర్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో మొత్తం 1346 మంది దొరికారు. వీరందరికి గోషామహల్, బేగంపేట టీటీల వద్ద కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. మళ్లొక్క సారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.