ఇక యూపీఐతో ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్‌‌‌‌

ఇక యూపీఐతో ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్‌‌‌‌
  • ఇక యూపీఐతో ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్‌‌‌‌
  • కొత్త ఫీచర్ లాంచ్‌‌‌‌ చేసిన  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ
  • తగ్గనున్న డెబిట్‌‌‌‌ కార్డుల అవసరం
  • భవిష్యత్‌‌‌‌లో ఏటీఎంలే చిన్న సైజ్ బ్యాంకింగ్ యూనిట్లు

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్‌‌‌‌ ఇంటర్‌‌‌‌‌‌‌‌ఫేస్‌‌‌‌ (యూపీఐ)  వాడకం విపరీతంగా పెరిగింది. కేవలం ఆన్‌‌‌‌లైన్ పేమెంట్స్‌‌‌‌కే ఇది పరిమితం కాలేదు. క్యాష్‌‌‌‌లెస్ డిపాజిట్లకు యూపీఐ యాప్‌‌‌‌లను వాడే టైమ్‌‌‌‌ వచ్చింది. డెబిట్ కార్డులు, ఇతర ఏ కార్డులను  మోసే అవసరం ఉండదు.  యూపీఐ ఇంటరాపరబుల్‌‌‌‌ క్యాష్ డిపాజిట్  (ఐసీడీ) ఫీచర్‌‌‌‌‌‌‌‌ను తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ ఫెస్ట్‌‌‌‌లో  రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌‌‌‌‌‌‌‌ టీ రవి శంకర్‌‌‌‌‌‌‌‌  ఆవిష్కరించారు.  కానీ,  క్యాష్ డిపాజిట్‌‌‌‌, విత్‌‌‌‌డ్రా  రెండు సర్వీస్‌‌‌‌లను అందిస్తున్న ఏటీఎంలలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

యూపీఐ ద్వారా కొన్ని ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌‌‌‌డ్రా చేసుకునే ఫెసిలిటీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.  బ్యాంకులు, వైట్‌‌‌‌ లేబుల్‌‌‌‌ ఏటీఎం ఆపరేటర్లు నిర్వహించే ఏటీఎంలలో  క్యాష్‌‌‌‌ను డిపాజిట్‌‌‌‌ చేసుకోవడానికి యూపీఐ ఐసీడీతో వీలుంటుందని  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌పీసీఐ) ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. బ్యాంకులు ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌ను త్వరలో అమల్లోకి తీసుకొస్తాయని  వివరించింది. యూపీఐకి లింకై ఉన్న మొబైల్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌, వర్చువల్ పేమెంట్స్ అడ్రస్‌‌‌‌  ( వీపీఏ), అకౌంట్ ఐఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీని వాడి కస్టమర్లు మరింత ఈజీగా క్యాష్‌‌‌‌ను ఏటీఎంలలో  డిపాజిట్ చేసుకోవచ్చని  ఎన్‌‌‌‌పీసీఐ పేర్కొంది. 

భవిష్యత్‌‌‌‌లో మరిన్ని ఫీచర్లు

క్యాష్ డిపాజిట్లతో పాటు  ఏటీఎంలను చిన్నసైజ్‌‌‌‌ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు (డీబీయూ) గా  మారుస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. బ్యాంకింగ్ యాప్‌‌‌‌లతో ఇది సాధ్యమవుతుందని తెలిపింది. భవిష్యత్‌‌‌‌లో ప్రజలు ఏటీఎంల ద్వారానే  బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డుకి అప్లయ్ చేసుకోవడం, ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లను ఓపెన్ చేయడం, సేఫ్‌‌‌‌ డిపాజిట్ లాకర్స్‌‌‌‌ కోసం అప్లయ్‌‌‌‌ చేసుకోవడం వంటి సర్వీస్‌‌‌‌లను ఏటీఎంల ద్వారా పొందొచ్చని  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వివరించింది.  ఆన్‌‌‌‌లైన్ పేమెంట్స్‌‌‌‌లో యూపీఐ ఇప్పటికే కీలకంగా  మారింది. 

కిందటి ఆర్థిక సంవత్సరంలో 13,100 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయని అంచనా. వీటి విలువ సుమారు రూ. 265 లక్షల కోట్లుగా ఉంది. భవిష్యత్‌‌‌‌లో యూపీఐ వాడకం మరింత పెరుగుతుందని ఎక్స్‌‌‌‌పర్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, ఎన్‌‌‌‌పీసీఐ కలిసి యూపీఐలో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు తెస్తున్నాయి. మనీ పంపుకోవడమే కాకుండా, యూపీఐతో మర్చంట్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు, బిల్ పేమెంట్లు వంటివి చాలా చేసుకోవచ్చు.  యూపీఐ సర్కిల్‌‌‌‌ పేరుతో కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. యూపీఐ యూజర్లు తమ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పంపుకోవడానికి తమకు నమ్మకం ఉన్నవారికి వీలు కల్పించొచ్చు.

ఐసీఐసీఐ డైరెక్ట్ బ్లాగ్ ప్రకారం యూపీఐ ద్వారా ఈ కింది విధంగా క్యాష్‌‌‌‌ను డిపాజిట్‌‌‌‌ చేసుకోవచ్చు. 

స్టెప్ 1:  యూపీఐ క్యాష్ డిపాజిట్‌‌‌‌ను సపోర్ట్ చేసే ఏటీఎంను మొదట గుర్తించాలి. క్యాష్ డిపాజిట్ చేసే ముందు  డెబిట్ కార్డ్ ఆప్షన్‌‌‌‌కు 
బదులు ‘యూపీఐ క్యాష్ డిపాజిట్‌‌‌‌’ ఆప్షన్‌‌‌‌ను ఎంచుకోవాలి. 
స్టెప్‌‌‌‌ 2:  క్యూఆర్ కోడ్‌‌‌‌ ఒకటి డిస్‌‌‌‌ప్లే అవుతుంది. ఈ కోడ్‌‌‌‌ను యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయాలి. 
స్టెప్‌‌‌‌ 3:  ఒక్కో డినామినేషన్‌‌‌‌కు సంబంధించి ఎన్ని నోట్లు ఉన్నాయో నెంబర్‌‌‌‌‌‌‌‌ ఎంటర్ చేయాలి. ఉదాహరణకు   రూ.100 నోట్లు మూడు, రూ.500 నోట్లు  రెండు ఉంటే  ఈ నెంబర్స్‌‌‌‌ను ఎంటర్ చేయాలి.  ఆ తర్వాత ఏటీఎం మెషీన్ కన్‌‌‌‌ఫర్మేషన్ స్లిప్‌‌‌‌ను ఇష్యూ చేస్తుంది. 
స్టెప్ 4:  డిపాజిట్  చేస్తున్న అమౌంట్‌‌‌‌ను యూపీఐ యాప్ చూపిస్తుంది. ఈ అమౌంట్‌‌‌‌ మెషీన్‌‌‌‌లో  డిపాజిట్ చేస్తున్న అమౌంట్‌‌‌‌ సరిపోయాయో? లేదో?  వెరిఫై చేసుకోవాలి. 
స్టెప్ 5:  చాలా మందికి  ఒకటి కంటే ఎక్కువ యూపీఐ లింక్డ్‌‌‌‌ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి.  ఏ అకౌంట్‌‌‌‌లో డబ్బులు వేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌‌‌‌ను సెలెక్ట్ చేసుకోవాలి.  ఆ తర్వాత యూపీఐ పిన్‌‌‌‌ను ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్‌‌‌‌ను పూర్తి చేయాలి.