రాజ్యసభలో నోట్ల కట్టలు: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు దగ్గర అంటూ చైర్మన్ వ్యాఖ్యలు

రాజ్యసభలో నోట్ల కట్టలు: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు దగ్గర అంటూ చైర్మన్ వ్యాఖ్యలు

పెద్దల సభ.. రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం.. డబ్బుల కట్టలు సభలో దొరికాయంటూ సిబ్బంది.. చైర్మన్ దృష్టికి తీసుకెళ్లటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2024, డిసెంబర్ 5వ తేదీన.. సభ ముగిసిన తర్వాత తనిఖీల్లో భాగంగా.. రాజ్యసభ సిబ్బందికి.. సీటు నెంబర్ 222 దగ్గర నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సీటు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన ఎంపీ అభిషేక్ మనుసింగ్ ది కావటంపై.. ఇప్పుడు ఈ అంశంపై సంచలనంగా మారింది.

రాజ్య సభలో నోట్ల కట్టలు తీవ్ర కలకలం రేపాయి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం ఉభయ సభల్లో కార్యకలాపాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2024, డిసెంబర్ 5వ తేదీ గురువారం రాజ్య సభలో భద్రతా సిబ్బందికి రూ.500 నోట్ల కట్టలు లభ్యం అయ్యాయి.  సభ ముగిసిన తర్వాత రోజు వారీ భద్రతా తనిఖీల్లో భాగంగా సెక్యూరిటీకి ఈ నోట్ల కట్టలు దొరికాయి. ఈ విషయాన్ని రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ధృకర్ వీకరించారు. తెలంగాణ నుండి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద ఈ నోట్ల కట్టలు లభ్యం అయినట్లు చైర్మన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు చైర్మన్ ధన్ కర్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. నోట్ల కట్టల వ్యవహారం శుక్రవారం (డిసెంబర్ 6)  రాజ్య సభలో అధికార, విపక్షాల మధ్య రగడ రాజేసింది. డబ్బు ఎవరిదనే దానిపై చైర్మన్ విచారణకు ఆదేశిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ సభ్యుడి అభిషేక్ మను సింఘ్వీపై విచారణకు ఆదేశించడాన్ని తప్పుబట్టారు. మరోవైపు నోట్ల కట్టల ఇష్యూపై ప్రతిపక్ష కాంగ్రెస్‎పై బీజేపీ విమర్శల ఎటాక్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడుతూ.. సభలో నోట్ల కట్టలు బయటపడటం చాలా తీవ్రమైన అంశమని.. ఇది సభ గౌరవానికి భంగం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చైర్మన్ విచారణకు ఆదేశించడాన్ని నడ్డా సమర్థించారు.  సమగ్ర విచారణ జరుగుతుందన్న మీ తీర్పుపై నాకు నమ్మకం ఉందని అన్నారు. 

మరోవైపు తనపై వస్తోన్న నోట్ల కట్టల ఆరోపణలపై ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు దీని గురించి నేను వినలేదు. నేను సభకు వెళ్లేటప్పుడు ఒక రూ.500 నోటు మాత్రమే తీసుకువెళ్తా. సభలో నా సీటు వద్ద నోట్ల కట్టలు దొరకడం గురించి మొదటి సారి విన్నా. గురువారం నేను 12:57 గంటలకు సభకు చేరుకున్నా. మధ్యాహ్నం 1:00 గంటలకు సభ వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల వరకు క్యాంటీన్‌లో కూర్చుని తర్వాత పార్లమెంటు నుండి బయటకు వెళ్లా’ అని పేర్కొన్నారు.