ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. మద్నూరు మండలం సలాబత్‌పూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Also Read :- చేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ హోరెత్తిన నినాదాలు
ఈ తనిఖీల్లో రూ. 2. 40 లక్షల నగదు పట్టుబడింది. మహారాష్ట్ర నుంచి కారులో వస్తున్న వ్యక్తి దగ్గర ఈ నగదుని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు.