టెక్నాలజీ : భలే భలే..వేలి వాచ్​లు

టెక్నాలజీ :  భలే భలే..వేలి వాచ్​లు

సెల్ ఫోన్​ చేతికి వచ్చిన దగ్గరి నుంచి టైం చూసుకునేందుకు రిస్ట్​ వాచ్​తో పనిలేకుండా పోయింది. అంటే.. చేతి వాచీల ట్రెండ్ చాలావరకు తగ్గిపోయిందన్నమాటే. అయితే రాబోయే కాలంలో అవి కూడా కనిపించవేమో! ఎందుకంటే ఇప్పుడు చేతికి కాదు.. వేలికి పెట్టుకునే వాచీ​లు వచ్చాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును.. నిజంగానే వేలికి పెట్టుకునేలా ఉంగరం సైజులో ఉండే వాచీ​లు మార్కెట్​లోకి వచ్చేశాయి. జపాన్​ కంపెనీ ‘క్యాసియో’, ‘స్టాస్టో స్టాండ్ స్టోన్స్’ అనే కంపెనీతో కలిసి వీటిని తయారుచేసింది.

ఇందులో ఎన్నో రకాల డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు... వేలి వాచీల్లో కాలిక్యులేటర్, డిజిటల్ డిస్​ప్లే వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. మరి వీటి రేటు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మోడల్​ని బట్టి రేట్ ఉంటుంది. మూడు డాలర్ల నుంచి మొదలు అంటే.. 249 రూపాయల నుంచి రేట్లు మొదలన్నమాట.