కులమేనా గెలుపుకు మూలం!

కులమేనా గెలుపుకు మూలం!

బీహార్‌‌లో కుల రాజకీయాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. లోక్‌‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైనా అటు ఎన్డీయే కూటమి కానీ, ఇటు లాలూకి చెందిన మహాకూటమి కానీ కేండిడేట్లను ఖరారు చేయలేదు. అసలు మహాకూటమి ఉనికే లేదు. దీనికి కారణం ‘క్యాస్ట్ ఈక్వేష న్’లో అన్ని రాజకీయ పార్టీలు, కూటమలు బిజీగా ఉండటమే. బీహార్ రాజకీయాల్లో సిద్ధాం తాలు, రాద్ధాం తాల కంటే కులాలే కీలక పాత్ర పోషిస్తాయంటా రు రాజకీయ పండితులు. గతంలో అనేక సార్లు ఈ విషయం  రుజువు కూడా అయింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకాలు ఖరారు చేసుకున్నప్పటికీ కేండిడేట్లను ఖరారు చేయడానికి వెనకాముందు ఆడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఏ నియోజకవర్గంలో ఏ కులానికి టికెట్ ఇవ్వాలా అని తర్జనభర్జనలు పడుతున్నాయి.

‘కేండిడేట్లను ఖరారు చేయడంలో అనేక అంశాలు పనిచేస్తాయి. అన్నిటి కంటే కులం చాలా ముఖ్యమైంది’ అంటారు సీనియర్ బీజేపీ నేత ఒకరు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ భాయ్ వీరేంద్ర కూడా ఇదే మాట చెప్పారు. రాజకీయ పార్టీలు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా , కులాన్ని విస్మరించలేని పరిస్థితి బీహార్‌‌లో ఉందన్నారు. జనం మొట్టమొదట కనెక్ట్ అయ్యేది కేండిడేట్ కులంతోనే అంటా రు జేడీ (యు) కు చెందిన ఓ లీడర్. ఇక్కడ కులం తర్వాతే అభివృద్ధి కానీ మరోటి కానీ. ‘ప్రస్తుత బీహార్ పాలిటిక్స్‌‌లో కులం అనేది ఓ వాస్తవం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే కులాన్ని బేస్‌‌ చేసుకోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు’ అన్నారు రాజకీయ విశ్లేషకులు సత్యనారాయణన్ మదన్. ‘బీహార్ పాలిటిక్స్‌‌లో కులం అనేది మొదటి నుంచీ కీలకమే. ఇది కొత్త గా వచ్చిన డెవలప్‌‌మెంట్ కాదు. కొన్ని దశాబ్దా ల నుంచి అంతర్లీనంగా ఉన్నదే. అయితే ఇప్పుడు బహిరంగమైంది. కులానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రస్తుతం అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు.. అంతే ”అన్నారు. పొలిటికల్ సోషియాలజిస్ట్ డీఎం దివాకర్. కేవలం అభివృద్ధి మంత్రమే రాజకీయాల్లో పనిచేస్తే, సోషల్ ఇంజనీరింగ్ అనే పదమే వినిపిం చేది కాదన్నారు. ఎన్నికల నగారా మోగకముందే.. కులాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎన్డీయే కూటమే ముందుంది.

2018 నవంబర్, డిసెంబర్లోనే బీజేపీ, జేడీ(యు), లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) విడివిడిగా కీలక కుల సంఘాల సమావేశాలు పెట్టాయి. లోక్‌‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కులాల పట్ల అనుసరించాల్సిన వైఖరిపై సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చాయి. గెలుపోటములను ప్రభావితం చేసే పెద్ద కులాలు భూమిహార్, రాజ్‌ పుత్, కాయస్థ, బ్రాహ్మణ కులాలకు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఈ పెద్ద కులాలకు ముంగేర్, బేగుసరాయ్, మోతీహరి, ఔరంగాబాద్, పట్నా సాహిబ్, దర్భంగా, మహారాజ్ గంజ్ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మంచి పలుకుబడి ఉంది. ఇక్కడ కేండిడేట్ల తలరాతలు మార్చగల స్థాయిలో ఈ కులాలున్నాయి. ఓబీసీలు, ఈబీసీలు కీలకం ముజఫర్ పూర్, భగల్పూర్ సహా మరికొన్ని నియోజకవర్గాల్లో ఓబీసీలు, అత్యం త వెనకబడ్డ తరగతులు (ఈబీసీలు) కీలకంగా మారాయి. ఎన్డీయే, మహాకూటమి రెండూ ఇక్కడ యాదవ్, కుర్మీ కులాల కేండిడేట్లను బరిలోకి దింపడానికి పక్కా ప్లానులు వేస్తున్నాయి.

నలంద  యోజకవర్గంలో జేడీ (యు) తరఫున కుర్మీ కులానికి చెందిన వ్యక్తిని జేడీ (యు) బరిలోకి దింపుతోంది. నలంద సెగ్మెం ట్‌ లో కుర్మీ కులాల ప్రాబల్యం ఎక్కువ. నలందను ‘కుర్మిస్థా న్ ’ అని కూడా పిలుస్తారు. మాదేపూర్ నియోజకవర్గంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉంటా రు. అందుకే ఏ పార్టీ అయినా యాదవులకే టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పెద్ద కులాలు, ఓబీసీలపై బీజేపీ ఆశలు పెద్ద కులాలు సహజంగా బీజేపీకి అండగా ఉంటాయి. యాదవులు మినహా కుర్మీ వంటి ఓబీసీలు కూడా కాషాయ పార్టీకే మద్దతు ఇస్తాయి. రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న అత్యం త వెనకబడ్డ తరగతులపై (ఈబీసీ) బీజేపీ, జేడీ (యు) దృష్టి పెట్టాయి. 15.7 శాతం ఉన్న ఎస్సీలను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఈ రెం డు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యాదవుల్లో మెజారిటీ వర్గం సహజంగా లాలూ ప్రసాద్ వైపు ఉంటుంది. యాదవుల్లో చీలిక తీసుకురావడానికి రామ్ కిర్పాల్ అనే లీడర్ ను బీజేపీ ఉపయోగించుకుంది. అప్పటివరకు లాలూ ప్రసాద్ కు దగ్గరివాడైన కిర్పాల్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. 2016 లో మరో యాదవ ప్రముఖుడు నిత్యాబంద్ రాయ్‌‌ని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ గా బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా నియమించారు. ఈసారి ఎన్నికల్లో అత్యంత వెనకబడ్డ తరగతులు, మహా దళితులను కలుపుకుని పోవాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీ(యు) అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ చెప్పారు. కుల సమీకరణలతో పాటు నితీశ్ సర్కార్ చేసిన అభివృద్ధి తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని జేడీ(యు) వర్గాలు భావిస్తున్నాయి. కేండిడేట్ల తలరాతలను మార్చే కుల సమీకరణల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం బిజీగా ఉన్నాయి. భూమిహార్‌‌లు బాగా పవర్ ఫుల్ బీహార్ పాలిటిక్స్ ని శాసించే కులాల్లో భూమిహార్ ఒకటి. ఈ కులం వాళ్లు జనాభాలో 3 శాతమే. జనాభా తక్కువే ఉన్నా రాజకీయాల్లో భూమిహార్‌‌లను విస్మరిం చలేని పరిస్థితి. వీళ్లు చాలా కాలంగా బీజేపీకి అండగా నిలబడుతున్నారు.

యాదవులు 15 శాతం జనాభాలో 15 శాతం ఉన్న యాదవులు రాజకీయంగా చక్రం తిప్పుతుంటా రు. భూమిహార్ లతో వీళ్లకుహోరాహోరీ పోరు నడుస్తోంది. లాలూ సొంత పార్టీ ఆర్జేడీకి యాదవుల పార్టీగా పేరుంది. ఓబీసీల్లో అతి పెద్ద వర్గమైన యాదవులకు 17శాతం వరకు ఉన్న ముస్లిం ల మద్దతు ఉండటం విశేషం. యాదవ్, ముస్లిం కాంబినేషన్ చాలా ఏళ్లపాటు బీహార్ పాలిటిక్స్ ను శాసించింది.