కంప్లయింట్ ​చేసినందుకు కుల బహిష్కరణ

కంప్లయింట్ ​చేసినందుకు కుల బహిష్కరణ

ఖమ్మం టౌన్, వెలుగు: చింతకాని మండలం రాఘవపురం సర్పంచ్ గోవిందయ్య, ఎస్టీ కుల పెద్దలు శ్రీరామ్, వెంకన్నల  మాట ధిక్కరించి పీఎస్​లో కంప్లయింట్​ చేసినందుకు కులబహిష్కరణ చేశారని ఎరుకుల కులానికి చెందిన పుట్టబంతి అచ్చయ్య వాపోయాడు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడాడు. రెండేండ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ యువకుడు తన కూతురికి యాక్సిడెంట్ ​చేశాడని, దీనిపై కంప్లయింట్​చేసినందుకు కుల బహిష్కరణ చేశారన్నారు. అప్పటి నుంచి ఊర్లో ఎవరూ సహకరించవద్దని సర్పంచ్, కుల పెద్ద హెచ్చరించడంతో తాము ఒంటరి వాళ్లమైపోయామన్నారు. దిక్కుతోచక 70 ఏండ్లుగా ఉంటున్న గ్రామాన్ని విడిచి వేరే ఊరికి వెళ్లిపోయానని, ఘటనపై చింతకాని పీఎస్​లో కంప్లయింట్​చేసినా న్యాయం చేయలేదన్నారు.  ఇప్పుడు గ్రామంలో మంజూరైన ఇల్లును కూడా లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కుటుంబసభ్యులు నాగరాజు, సుజాత, మనీషా, చిన్నకమా, 
గోవిందమ్మ, నాగబాబు పాల్గొన్నారు.