కులగణన రాష్ట్ర సర్కార్ చారిత్రక నిర్ణయం

కులగణన రాష్ట్ర సర్కార్ చారిత్రక నిర్ణయం
  •       శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: తెలంగాణలో కుల గణన సర్వే ప్రభుత్వ చారిత్రక నిర్ణయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 2014 లో నాటి ప్రభుత్వం చేసిన సర్వే అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని, ప్రతీ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరైంది కాదన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఇంట్లో  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో 96 శాతం మంది ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ సర్వే లో కొందరు పెద్దలు కూడా పాల్గొనకపోవడం కరెక్ట్ కాదన్నారు.  పదేండ్లుగా  కొత్త రేషన్ కార్డు కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. బీపీఎస్, ఏపీఎల్ కార్డ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానన్నారు. దీనిపై స్పందించి సీఎం  రేవంత్ రెడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.