- సుప్రీం, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో మీటింగ్ పెట్టండి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కులగణనలో లీగల్ సమస్యలు రాకుండా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సుప్రీం, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలతో మీటింగ్ ఏర్పాటు చేసి కులగణనపై సలహాలు తీసుకోవాలని సూచించారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.
కులగణన కోసం హైకోర్టు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించిందని, కానీ, చట్టాన్ని తయారు చేసుకోకుండానే ప్రభుత్వం సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నదని తెలిపారు. సర్కారు రెండు వేర్వేరు జీవోలు ఇచ్చి గందరగోళం సృష్టించిందని చెప్పారు. బిహార్, మహారాష్ట్ర, కర్నాటకలో చేసిన తప్పులనే ఇక్కడ చేస్తున్నారని పేర్కొన్నారు. కులాలు, ఉపకులాల జనాభా సర్వేతోనే లెక్క తేలుతుందని వివరించారు. లీగల్గా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.