కులగణన పూర్తి స్థాయిలో చేయాలి.. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి

కులగణన పూర్తి స్థాయిలో చేయాలి.. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి

మేడిపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను అసంపూర్తిగా కాకుండా పూర్తి స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్​లో కులగణనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేడ్చల్ కాంగ్రెస్ ఇన్​చార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కుల గణన చేపట్టలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు సముచిత రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని బాలలక్ష్మి సూచించారు.