- రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వే ఇప్పటివరకూ 72 శాతం పూర్తయ్యింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లను గుర్తించగా.. మంగళవారం నాటికి 83,64,331 ఇండ్లలో సర్వే కంప్లీట్ అయింది. ములుగులో అత్యధికంగా 98.9 శాతం ఇండ్లలో కులగణన సర్వే పూర్తి కాగా.. ఆ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 95 శాతంతో నల్గొండ జిల్లా రెండో స్థానంలో, 93.3 శాతంతో జనగామ జిల్లా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
జీహెచ్ఎంసీలో అత్యల్పంగా 50.3 శాతం ఇండ్లలో సర్వే పూర్తయింది. మేడ్చల్లో 61.3 శాతం, హనుమకొండలో 63, వికారాబాద్ జిల్లాలో 67.4 శాతం ఇండ్లలో సర్వే కంప్లీట్ అయింది. కాగా, త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.