తమిళనాట రాజకీయాల్లో కులాలే కీలకం

పోలింగ్ టైమ్ దగ్గరపడటంతోతమిళనాడులో రాజకీయ పరిస్థితులుమారిపోయాయి. సిద్ధాంతాలు రాద్ధాంతాలు మెల్లమెల్లగా పక్కకు పోయాయి. కులాలే కీలకంగా మారాయి. కేండిడేట్ల తలరాతలను మార్చే కులాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి లీడర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే బీసీ కులాల్లో పెద్ద కులమైన వన్నియార్లను ముఖ్యమంత్రి పళనిస్వామి తమ వైపునకు లాక్కున్నారు. పళనిస్వామి తన సొంతకులమైన వెల్లాల గౌండర్లను కూడా తమవైపునకు తిప్పుకున్నారు.

తమిళనాడులో ప్రస్తుతం కులాల లెక్కలే కీలకంగా మారాయి. ఈ లెక్కల ఆధారంగానే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక్కడ అన్నా-డీఎంకేతో  పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేస్తోంది.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో అన్నా డీఎంకే అధికారంలో ఉండటంతో  ప్రజా వ్యతిరేకత అనే అంశం తెరమీదకు వస్తుందని అందరూ భావించారు. చదువుకున్న కుర్రవాళ్లకు కొలువులు దొరక్కపోవడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, జీఎస్టీ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు తమిళనాడు పర్యటనకు వచ్చినా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో‘యాంటీ ఇన్ కంబెన్సీ ’ ఫ్యాక్టర్ ను ఎదుర్కోవడానికి కులాల లెక్కలే బెటర్ అని ముఖ్యమంత్రి ఈ. పళనిస్వామి డిసైడ్ అయినట్లున్నారు.మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కులాల లెక్కలపై సీఎం పళనిస్వామి దృష్టి పెట్టారు.

అన్నా డీఎంకేతో పీఎంకే దోస్తానా

లేటెస్ట్ గా డాక్టర్ ఎస్. రాందాస్ నాయకత్వంలోని ‘పట్టాళి మక్కళ్‌ కచ్చి’ (పీఎంకే ) పార్టీతో అన్నాడీఎంకే ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. పీఎంకే కు వన్నియార్ కులస్తుల మద్దతు సహజంగా ఉంటుంది. తమిళనాడులోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వన్నియార్ కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నా రు. పీఎంకే తీరు నిన్న-మొన్నటివరకు అన్నా డీఎంకే పై అగ్గిమీద గుగ్గిలంగాఉండేది. పళనిస్వామి సర్కార్ అవలంబిస్తున్న విధానాలను తూర్పారపట్టేది. అయితే వన్నియార్ల అభివృద్దికి పళనిస్వామి గట్టి హామీ ఇవ్వడంతోనే చివరకు డాక్టర్ రాం దాస్ జై కొట్టినట్లు రాజకీయ పండితుల అంచనా.ఉత్తర జిల్లాల్లో ని 10 లోక్ సభ సెగ్మెంట్లలో వన్నియార్లు పెద్ద సంఖ్యలో ఉన్నా రు. వీరందరూ డాక్టర్ రాం దాస్ నాయకత్వం లోని పీఎంకే కు గట్టి మద్దతుదారులు. అన్నా డీఎంకే కు రాం దాస్ మద్దతు పలకడంతో ఈ 10లోక్ సభ నియోజకవర్గాల్లో నూ కేండిడేట్ల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వన్నియార్ల సంగతి ఇలా ఉంటే, దక్షిణజిల్లాల్లో బీసీ కమ్యూనిటీకి చెందిన నాడార్లు కీలక పాత్ర పోషిస్తున్నా రు. నాడార్లు మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఈసారి కూడా వీరి ఓటు తమ నాయకత్వంలోని కూటమికే పడుతుందని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నా యి.

వెల్లాల గౌండర్లు కూడా అన్నా డీఎంకే వైపే

ముఖ్యమంత్రి పళనిస్వామి ‘వెల్లాల గౌండర్ ’ అనే బీసీ కులానికి చెందిన రాజకీయవేత్త. లేటెస్ట్ గా ఈ కులం కూడా అన్నా డీఎంకే కు జై కొట్టిం ది. ‘మనవాడు సీఎం అయితే మనం సపోర్ట్ చేయకపోతే ఎలా ’ అని వెల్లాల గౌండర్ కులస్తులందరూ డిసైడ్ అయినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం. పశ్చిమ తమిళనాడులోని ఆరు లోక్ సభ నియోజకవర్గాల్లో గౌండర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కేండిడేట్ల తలరాతలను మార్చగల సత్తా ఇక్కడ గౌండర్లకు ఉంది.

వన్నియార్లపై మిగతా బీసీ కులాలకు వ్యతిరేకత?

రాష్ట్రంలోని నార్త్ వెస్ట్రన్ ప్రాంతాల్లో వన్నియార్లకు మిగతా బీసీలైన చెట్టియార్, మొదలియార్,ఉదయార్, రెడ్డియార్ కులాలతో తేడాలున్నాయి. బీసీ వర్గం లో పెద్దన్నయ్య పాత్ర వన్నియార్లు పోషిస్తున్నారన్నది మిగతా కులాల ఆరోపణ. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వన్నియార్లకు, దళితులకు పొసగదు. దళితుల హక్కుల కోసం పోరాడే పార్టీగా పేరున్న ‘విదుతలై చిరుతైగల్ కచ్చి ’ (వీసీకే)కి, పీఎంకే కు మధ్య చాలా కాలం నుంచి గొడవలున్నా యి. 2013 లో ధర్మపురికి  చెందిన ఇళవరుసు అనే దళితుడి హత్య తమిళనాడును కుదిపేసింది. అప్పటి నుంచి రెండు కులాల మధ్య గొడవలు ఇంకా పెరిగాయి. ఈ నేపథ్యం లో వన్నియార్ల కుల పార్టీగా పేరున్న పీఎంకేతో జత కట్టడం వల్ల అన్నా డీఎంకే కు దళితులు దూరం అవుతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్డ్ తెగల ( ఎస్టీ) ఓట్లపై అన్నా డీఎంకే ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో పోలిస్తే ధర్మపురి జిల్లాలో ఎస్టీల జనాభాఎక్కువ. ఇక్కడి షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఒకే పార్టీ కి మద్దతుదారులుగా లేరు. కొన్నిసార్లు డీఎంకే కు జైకొడితే మరికొన్ని సార్లు అన్నా డీఎంకే వైపు ఉన్నారు.ఆయా పరిస్థితులను బట్టి రెండు ద్రవిడ పార్టీలకు ఓటేశారు. దీంతో ఈసారి ఎస్టీలను తమ టీంలోకి తీసుకురావడానికి పీఎంకే చీఫ్ రాం దాస్ ప్రయత్నిస్తున్నారు.

కోటా పెంపు రామదాసు పుణ్యమే

రిజర్వేషన్లు 50శాతం దాటకూడదన్నది రాజ్యాంగ నిబంధన. అయితే, తమిళనాడులోమాత్రం 69  శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా యి. తెలంగాణ సహా ఏ రాష్ట్రమైనా రిజర్వేషన్ల విషయంలో తమిళనాడునే ఉదహరిస్తుంటాయి. ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా పెరగడానికి కారకుడు డాక్టర్‌ ఎస్‌.రామదాస్‌. 1980లో ఆయన తన వన్నియార్‌ కుల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. క్రమంగా దాని పరిధిని పొలిటికల్‌, ఎన్విరాన్ మెంట్‌ ఇష్యూలవైపు మళ్లించారు. చెట్లను నరికి వేయడాన్ని అడ్డుకునేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మోస్ట్‌ బ్యాక్ వర్డ్‌ కమ్యూనిటీలకు 20 శాతం కోటా కల్పించాలన్న డిమాండ్ తో ఉద్యమించారు. ఆ సందర్భంగా పోలీసుల చర్యలకు 21 మంది బలయ్యారు. చివరికి రామదాస్‌ డిమాండ్ కి తలొగ్గక తప్పలేదు. తమిళనాడులోబీసీ నాన్‌–ముస్లింలకు 26.5%, బీసీ ముస్లింలకు 3.5% కల్సిస్తుం డగా, ఎంబీసీలకు, డీనోటిఫైడ్‌ కమ్యూనిటీలకు20 శాతం ఇస్తున్నా రు. వీరుగాక, ఎస్ సీలకు 15 శాతం, అరుంధతీయులకు 3 శాతం, ఎస్ టీలకు 2 శాతం…వెరసి మొత్తంగా 69 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. 1989లో తమ సంఘాన్ని రామదాస్‌ పట్టాళి మక్కళ్‌కచ్చి (పీఎంకే)గా మార్చారు. ఈ పార్టీ తరఫున ఆయన కుమారుడు డాక్టర్‌ అంబుమణి రామదాస్‌ కేంద్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. బహిరంగంగా పొగతాగడాన్ని నిషేధించిన ఘనత అంబుమణిదే.

బీజేపీ నామమాత్రమే

తమిళనాడులో బీజేపీ ఉనికి నామమాత్రమే.దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనే కాషాయ పార్టీకి కాస్తంత పట్టుంది. మిగతా ప్రాంతాల్లో గెలవాలంటే ఏదో ఒక ద్రవిడ పార్టీ అండ ఉండాల్సిందే. 16వ లోక్ సభ లో బీజేపీకి తమిళనాడు నుంచి ఒకే ఒక్క సీటు కన్యా -కుమారి ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ ప్రభంజనం ఉన్నా తమిళనాడులో మాత్రం జయలలిత గాలి బాగా వీచిం ది. రాష్ట్రంలోని 39 సెగ్మెంట్లలో 37 సీట్లను అన్నా డీఎంకే తన ఖాతాలో వేసుకుంది. అన్నాడీఎంకే కు ఓటు షేర్‌ 44.3 శాతం వచ్చింది.

తమిళనాడు అంతా 18న పోలింగ్

తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలకు ఈనెల 18న పోలింగ్ జరుగుతుంది. తమిళ పాలిటిక్స్ లో ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికలు చాలా కీలకమైనవి. తమిళ రాజకీయాలను చాలాకాలం పాటు శాసించిన బడా లీడర్లు ఎం. కరుణానిధి, జయలలిత లేకుండా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలో ఉన్నఅన్నా డీఎంకే, బీజేపీతో పొత్తు పెట్టుకోగా ప్రతిపక్షమైన డీఎంకే, కాం గ్రెస్ తో ఎన్నికల మైత్రి కుదుర్చుకుం