- సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్యాస్ట్ సెన్సస్ నిర్వహించాలి: దాసోజు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 95 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. కులగణనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అందలేదని బీసీ కమిషన్ చైర్మన్ చెప్పడం దుర్మార్గమన్నారు. సీఎం రేవంత్ చెప్పుచేతల్లో కమిషన్ పనిచేస్తున్నదని ఆయన ఆరోపించారు. కులగణనకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కులగణన చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేస్తున్నది కులగణనేనని ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పిందని, జనాభా లెక్కలను తీసే అధికారం ఏ రాష్ట్రానికీ లేదని పేర్కొన్నారు. ఏదైనా చేయాలంటే చట్టాన్ని సవరించాల్సిందేనని చెప్పారు. కాస్ట్ సెన్సస్ అని జీవోల్లో పేర్కొటూ రేవంత్ ప్రభుత్వం బీసీల నోట్లో మట్టి కొడుతున్నదన్నారు.