![Spirit:ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే ఆఫర్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..](https://static.v6velugu.com/uploads/2025/02/casting-call-for-sandeep-reddy-and-prabhas-spirit-movie_tTgU6YZu42.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం స్పిరిట్.. ఈ సినిమాకి డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ లో పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలే సందీప్ రెడ్డి ఆనిమల్ సినిమాతో అరాచకం సృష్టించాడు. దీంతో ఆనిమల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు. అంతేకాదు మ్యూజిక్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఐతే స్పిరిట్ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కానుంది. దీంతో సినిమాలోని నటీనటుల కోసం సందీప్ రెడ్డి వెతుకులాట మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తన అనుంబంధ ప్రొడక్షన్ సంస్థ అయిన భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో నటీనటులు కావాలని ఎక్స్ లో షేర్ చేశాడు.
ALSO READ | KINGDOM Teaser: మొత్తం తగలబెట్టేస్తా అంటున్న విజయ్ దేవరకొండ..
ఇందులో స్పిరిట్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని ఆసక్తిగల నటీనటులు సంప్రదించాలని తెలియజేశారు. ముందుగా 2 ఫోటోలు, 2 నిమిషాల ఇంట్రడక్షన్ వీడియోలని రికార్డ్ చేసి పంపించాలని ఈ మెయిల్ (spirit.bhadrakalipictures@gmail.com) కి కోరారు. ఎంపికైన వారిని ఆడిషన్ కి పిలుస్తామని తెలిపారు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా మీ ఫోటోలు, వీడియోలు పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
ఈ విషయం ఇలా ఉండగా స్పిరిట్ కోసం ప్రభాస్ కేవలం 90 రోజులు కాల్షీట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో జూన్ లో షూటింగ్ మొదలు పెట్టి 3 లేదా 4 నెలల్లో కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఐతే ఈ సినిమలో ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డే ని సెలక్ట్ చేసినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re calling all aspiring actors for an exciting casting opportunity in our film, "Spirit". pic.twitter.com/DgLZ5kIvNO
— Bhadrakali Pictures (@VangaPictures) February 12, 2025