VD14 Casting Call: ఈ తూరి సినిమా అంతా సీమలోనే.. బెరీనా పోయి మావోల్లను కల్వండి

VD14 Casting Call: ఈ తూరి సినిమా అంతా సీమలోనే.. బెరీనా పోయి మావోల్లను కల్వండి

మీది రాయలసీమనా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. విజయ్ దేవరకొండ తో నటించాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేసి ఆ అవకాశాన్ని దక్కించుకొండి. విజయ్ దేవరకొండతో తరువాత సినిమాలో నటించడానికి యాక్టర్స్ కావాలట. ఇందుకోసం కాస్టింగ్ కాల్ ప్రకటన కూడా చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా మొదలైంది ఈ సినిమా. అయితే.. ఈ సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలట. అది కూడా కేవలం రాయలసీమ యాస తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ అవకాశం. ఇదే విషయంపై తాజాగా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.. ఈ తూరి సినిమా అంతా మన సీమలోనే.. నటించాలనుకునేటోళ్లు బెరీనా పోయి మావోల్లను కల్వండి.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఆడిషన్స్.. జూలై 1,2 తేదీల్లో కర్నూలు, 3,4 తేదీల్లో కడప, 5,6 తేదీల్లో తిరుపతి, 7,8 తేదీల్లో అనంతపురంలో జరుగనున్నాయట. మరి మీలో కూడా రాయలసీమ యాస వచ్చి, నటన మీద ఆసక్తి ఉంటే ట్రై చేయండి. ఆ అవకాశం మీకే రావొచ్చు. 

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆర్మీ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.