
హైదరాబాద్ లో దాదాపు ఇంటికో కారు, రెండు మూడు బైక్ లు ఉన్నోళ్లు చాలామందే ఉన్నారు. బైక్ అయినా కార్ అయినా ఎక్కువ కాలం నడవాలంటే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించటం తప్పనిసరి. ప్రాబ్లమ్ ఏదీ లేకపోయినా ఇంజిన్ ఆయిల్ మాత్రం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండాలన్నది అందరికి తెలిసిన విషయమే... అయితే, అదే ఇంజిన్ ఆయిల్ నకిలీ అయితే.. మన కార్, బైక్ పరిస్థితి ఏంటి.. అవును హైదరాబాద్ లో బయటపడ్డ ఈ నకిలీ ఇంజిన్ ఆయిల్ బాగోతం గురించి తెలిస్తే.. బయట షాపుల్లో ఇంజిన్ ఆయిల్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. శనివారం ( ఏప్రిల్ 19 ) నకిలీ ఇంజిన్ ఆయిల్ దందా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
క్యాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్ పేరుతో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నూర్ ఖాన్ అనే వ్యక్తి నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేసి.. క్యాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్ లేబుల్స్ అంటించి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. పక్క సమాచారంతో దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 3 లక్షల రూపాయల విలువచేసే 710 లీటర్ల నకిలీ ఆయిల్ సీజ్ చేసినట్లు తెలిపారు.
మరి.. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేందుకు ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళడానికి బద్దకించి.. దగ్గర్లోని షాపులో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటోళ్లు ఇకనైనా జాగ్రత్త పడండి.. ఎందుకైనా మంచిది మీ వెహికల్ కి వాడిన ఇంజిన్ ఆయిల్ నకిలీదో, ఒరిజినలో ఒకసారి చెక్ చేసుకోండి.