- ఆయన్ను పిల్లి కరవలేదన్న జైలు సూపరింటెండెంట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పిల్లి దాడి చేసింది. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపైకి ఓ పిల్లి పైనుంచి దూకింది. ఈ ఘటనలో ఆయనకు ఒంటిపై స్వల్ప గాయాలు అయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రాధాకిషన్ రావును పిల్లి కరిచిందని, ఆయనను హాస్పిటల్కు తరలించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే, పిల్లి కరిచిందన్న వార్తలను చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్శివకుమార్ గౌడ్ ఖండించారు. ఆయన్ను పిల్లి కరువలేదని స్పష్టం చేశారు. పిల్లి దూకడంతో గోర్ల గాట్లు పడ్డాయని సమాచారం. జైల్లో ఆయనకు టీటీ ఇంజక్షన్ వేసినట్టు తెలిసింది.