
సోషల్ మీడియాలో పెంపుడు జంతువుల వీడియోలు.. ఒక్కోసారి అవి చేసే చిలిపిచేష్టల వీడిమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తాయి. ఇప్పుడు అలానే చైనాలో ఓ పిల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...
చైనాలో ఓ ఆలయంలో పిల్లి బాబా అవతారం ఎత్తింది. జియువాన్ దేవాలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ... ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. పండితులు మెడలో రుద్రాక్షమాలను ధరించినట్లుగా ...ఈ పిల్లికి మెడలో బంగారు గొలుసు ఉంది. ఆ దేవాలయానికి వచ్చే భక్తులను ఆకర్షిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తుంది.
దేవాలయం గోడపై ఉన్న పిల్లి దగ్గరకు జనాలు రావడంతో కాలుతో భక్తులను తాకుతూ ఆశీర్వదించింది. ఇక ఆ తరువాత ఫొటోలు దిగేటప్పుడు హై ఫైవ్ (ఫోజులు) కూడా ఇచ్చింది. దీనిని చూసిన సందర్శకులు... భక్తులు.. పిల్లి ఆశీస్సుల కోసం జనాలు బారులు తీరారు.
ఈ వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో చైనా ఫోకస్ అనే ఖాతా షేర్ చేయబడింది. సుజౌలో ని వెస్ట్ గార్డెన్ ఆలయంలో బంగారు గొలుసు ధరించిన అందమైన పిల్లి పర్యాటకులతో హై-ఫైవ్‌లు ఇస్తూ వారితో ఫోటోలు దిగుతున్న వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లి చేస్తున్న పనిపై భిన్నమైన అభిప్రాయాలు, కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.
ఈ వీడియో షేర్ చేయబడిన తర్వాత... చాలా మంది ఆ పిల్లిని ఆరాధించారు. ఒకరు ఓ పిల్లి నీవు ధనవంతుడవు.. ఆశీర్వదించబడుతున్నావు.. అంటూ ఫన్నీగా రాశారు. మరొకరు పిల్లులను కూడా పూజించాలని కామెంట్చేశారు. ఇంకొకరు రెండు చేతులు జోడించి.. దేవుని తండ్రి సంబోధించారు.