ఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్​లకు తేల్చి చెప్పిన క్యాట్

ఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్​లకు తేల్చి చెప్పిన క్యాట్
  • వరదలతో ఇబ్బంది పడ్తున్న ప్రజలకు సేవ చేయాలని లేదా? అని నిలదీత
  • వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్​, రొనాల్డ్​ రోస్​కు దక్కని ఊరట
  • డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ
  • నేడు హైకోర్టులో లంచ్​మోషన్ ​పిటిషన్​దాఖలు చేయనున్న ఐఏఎస్​లు

హైదరాబాద్, వెలుగు: ఏ క్యాడర్​కు కేటాయించిన ఐఏఎస్​లు.. ఆ క్యాడర్​లోనే పనిచేయాలని సెంట్రల్​అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ( క్యాట్‌‌) తేల్చిచెప్పింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్​ ఐఏఎస్​లు, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్​ ఐఏఎస్​లు తమ సొంత క్యాడర్​లో బుధవారం రిపోర్ట్​ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో తమను ఏపీ క్యాడర్​కు వెళ్లాలంటూ ఈ నెల 9న డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని క్యాట్​ను ఆశ్రయించిన ఐఏఎస్‌‌ అధికారులకు ఊరట దక్కలేదు. తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్​కు చెందిన వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, డి.రొనాల్డ్‌‌ రోస్, జి.సృజన తమ సొంత క్యాడర్​కు వెళ్లాలని ఈ నెల 9న డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు క్యాట్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దీంతో ఒక్కో పిటిషన్‌‌‌‌‌‌‌‌పై క్యాట్‌‌‌‌‌‌‌‌ వేర్వేరుగా వాదనలు విన్నది. ఈ సందర్భంగా డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి క్యాట్‌‌‌‌‌‌‌‌ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చేనెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఐదో తేదీలోపు కౌంటర్లు దాఖలు చేయాల ని ప్రతివాదులను క్యాట్ ఆదేశించింది.

ఇంట్లో కూర్చొని సేవ చేస్తామంటే ఎలా..

విచారణ సమయంలో ఐఏఎస్​ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌లో జూనియర్, సీనియర్ తేడా లేకుండా.. స్వాపింగ్ చేసుకునే వీలుందని పేర్కొం ది. వన్ మ్యాన్‌‌‌‌‌‌‌‌ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారుల తరఫు అడ్వకేట్ క్యాట్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో క్యాట్​పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. 

అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశం గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌లో ఉందా? ఇంట్లో కూర్చొని సేవ చేస్తామంటే ఎలా? 1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు?’’ అంటూ క్యాట్‌‌‌‌‌‌‌‌ నిలదీసింది. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌‌‌‌‌‌‌‌రాస్‌‌‌‌‌‌‌‌  కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్‌‌‌‌‌‌‌‌,శివశంకర్‌‌‌‌‌‌‌‌ తెలంగాణకు రావాలి. ఇదిలాఉండగా.. క్యాట్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై బుధవారం హైకోర్టులో లంచ్​మోషన్ పిటిషన్​ దాఖలు చేస్తామని.. ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారుల తరఫు అడ్వకేట్లు తెలిపారు.