ఒక ఘటన మరువక ముందే ఇంకోటి..విద్యార్థులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అదే నిర్లక్ష్యం..స్టూడెంట్స్ అందించాల్సిన భోజనంలో ఎలుకలు.. అప్పుడు చట్నీలో ఎలుక ఈత కొట్టింది. ఇప్పుడు విద్యార్థులకు వడ్డించాల్సిన భోజనం పాత్రల్లోకి వెళ్లి పిల్లి ఒక్కో ఐటెం ను రుచి చూస్తోంది. విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో ఇంత నిర్లక్ష్యమా.. జేఎన్టీయూ హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రత, హాస్టల్ క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు రోజుకొకటి బయటికి వస్తున్నాయి. ఒక ఘటన జరిగిన తర్వాతకూడా మేల్కోకపోవడం హాస్టల్ మెయింటెనెన్స్ పై పలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
జెఎన్టీయూ కూకట్ పల్లి హాస్టల్ లో విద్యార్జులకు వడ్డించాల్సిన భోజనం ఉంచిన పాత్రల్లోకి వెళ్లి ఎలుకలు హడావుడి చేస్తున్న వీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది జెన్టీయూ హాస్టళ్లలో కొత్తగా..ఇంతకుముందు జెఎన్టీయూ , సుల్తాన్ పూర్ బ్రాంచ్ హాస్టల్ లో విద్యార్థులకు వడ్డించాల్సిన చట్నీ ఉంచిన బకెట్ లో ఎలుకపడి బయటికి వచ్చేందుకు ప్రత్నిస్తున్న వీడియాలో వైరల్ అయ్యారు. ఈ ఘటన జరిగి వారం గడవక ముందే జేఎన్టీయూ కూకట్ పల్లిబ్రాంచ్ హాస్టల్ లో పిల్లి విద్యార్థులు భోజనం ఉంచిన పాత్రలో విహారం చేయడంతో ప్రముఖ యూనివర్సిటీలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి.
అంతేకాదు హాస్టల్ ఫుడ్ లో చాలాసార్లు పురుగులు ఉన్న అన్నం వడ్డించారని.. పరిసరాల పరిశుభ్రత పై కూడా విద్యార్థులు అనేకమార్లు యాజమాన్యానికి ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా జెఎన్టీయూ కూకట్ పల్లి హాస్టల్ లో తనిఖీలు కూడా చేశారు. క్యాంటీన్ నిర్వహణ చెత్తగా ఉందని తేల్చారు. వంటగదిలో ఎక్కడిపడితే అక్కడ కూరగాయల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఆహారంలో నాణ్యతా లోపం ఉన్నట్లు గుర్తించారు. హాస్టల్ గదుల్లోకి క్రిమి కీటకాలు రాకుండా నిరోధించే ఎలాంటి ఏర్పాట్లు లేవని గుర్తించారు. FSSAI లేకుండా క్యాంటీన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంతజరిగినా ఈ విషయంలో స్పందించేందుకు అధికా రులు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
In search of rats they send some cats into jntuh boys hostel mess @Bhatti_Mallu @revanth_anumula @cfs_telangana @examupdt @examupdt @KTRBRS @Krishank_BRS @BRSparty @INCTelangana @jntuhofficial @BJP4Telangana @balaji25_t @BRSHarish @TelanganaCMO pic.twitter.com/Y8H7sMhpbj
— BHUKYA RAHUL (@BHUKYARAHUL9) July 16, 2024