దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్స్‌కు క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 28న పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే మంచి స్కోర్‌తో సక్సెస్ అవ్వొచ్చు. నేషనల్ లెవల్ లో జరిగే క్యాట్‌లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యం. ముందుగా సిలబస్ పూర్తిగా అర్థం చేసుకొని ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో భయం లేకుండా వేగంగా ఆన్సర్ చేయవచ్చు. ఏ కాన్సెప్ట్ మీద ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కడ తప్పులు చేస్తున్నామో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్‌తో తెలుస్తుంది.
ప్రవేశాలు కల్పించే క్యాంపస్‌లు: క్యాట్ 2021 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికాడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.
విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీసం 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తులు: ఆన్లైన్
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కు రూ.1100.
దరఖాస్తులు ప్రారంభం: 4 ఆగస్టు
చివరితేది: 15 సెప్టెంబర్
ఎగ్జామ్: నవంబర్ 28వ తేదీన మూడు సెషన్లలో నిర్వహించనున్నారు
పరీక్ష ఫలితాలు: 2022 జనవరి రెండో వారంలో విడుదల చేయొచ్చు.
వెబ్సైట్: www.iimcat.ac.in