‘వాట్సాప్ బిజినెస్’ యాప్‌లో కొత్త ఫీచర్ యాడ్ అయ్యింది. ‘క్యాటలాగ్’ పేరుతో కొత్తగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. బిజినెస్, షాపింగ్ ఈజీగా చేసేందుకు ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని యాప్ ప్రకటించింది. ‘క్యాటలాగ్’ ఫీచర్ ద్వారా బిజినెస్ యాప్ వాడుతున్న వాళ్లు తమ ప్రొడక్ట్స్‌ను ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు దీని ద్వారా తమకు నచ్చిన గూడ్స్‌ను ‘క్యాటలాగ్’లో సెర్చ్ చేసి, కొనుక్కోవచ్చు. దీనిలో ప్రొడక్ట్స్‌కు సంబంధించిన పేరు, ధర, ఇమేజెస్, ఇతర వివరాలు, లింక్స్‌ను షేర్ చేయొచ్చు. షాపింగ్ వెబ్‌సైట్స్‌కు వెళ్లకుండానే, డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే కస్టమర్లు నచ్చిన వాటిని ఆర్డర్ చేసే అవకాశం కూడా ఉంది.
వెబ్‌లోనూ డార్క్‌థీమ్
ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో ఇప్పటికే డార్క్‌థీమ్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇంకా వాట్సాప్‌లో మాత్రం ఇది అందుబాటులో లేదు. త్వర లోనే వాట్సాప్‌లో కూడా ‘డార్క్‌థీమ్’ ఫీచర్ స్టార్ట్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. యాప్‌తోపాటు ‘వాట్సాప్ వెబ్’లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెప్పింది. డార్క్‌థీమ్ ఫీచర్ వల్ల స్మార్ట్‌ఫోన్స్‌లో బ్యాటరీ లైఫ్ పెరగడంతోపాటు, కళ్లపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.
గ్రూప్‌ల బ్యాన్!
అభ్యంతరకరంగా, అనుమానాస్పదంగా ఉన్న గ్రూప్‌లను వాట్సాప్ తొలగిస్తోంది. చట్ట వ్యతిరేకమైన పేర్లు పెట్టుకున్న గ్రూప్‌లపై కూడా బ్యాన్ చేస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించిన వివరాలను వాట్సాప్ అధికారికంగా వెల్లడించే అవకాశం లేదు. కానీ, రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్‌లను తొలగిస్తూ వస్తోంది. ఒక్కసారి గ్రూప్ బ్యాన్ అయితే, దానిపై చర్చ, ఫీడ్‌బ్యాక్, కంప్లైంట్స్‌కు కూడా అవకాశం ఇవ్వడం లేదు వాట్సాప్.