- అధికారులను, కాంట్రక్టర్ ను ఆదేశించిన పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ రైల్వే ఆర్ఓబి నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు.. కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. గతంలో వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఆర్వోబి బ్రిడ్జ్ ను మంజూరు అయిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్వోబి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడకూడదని.. త్వరగా ఈ బ్రిడ్జిని నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలన్నారు. 1.6 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులనుఆదేశించారు. డిసెంబర్లోగా పూర్తి చేయాలని.. లేకపోతే కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు.