![ఫేస్ స్కాన్ చేసి దొంగల్ని పట్టేస్తున్నరు](https://static.v6velugu.com/uploads/2021/01/face-scan-1.jpg)
క్రిమినల్ డేటా ఆధారంగా సెర్చింగ్
బ్లూ కోల్ట్స్ ,పెట్రోలింగ్ సిబ్బందికి ట్యాబ్స్
ఈ నెలలో నలుగురు దొంగల పట్టివేత
“ సంతోష్‌నగర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా ఓ యువకుడు కనిపించాడు. పిలిచి వివరాలు అడిగారు. ట్యాబ్‌లో ఫొటో తీసుకుని ఫేషియల్ రికగ్నేషన్, టీఎస్ కాప్ యాప్‌లో చెక్ చేశారు. దీంతో ఆ యువకుడికి క్రైమ్ హిస్టరీ ఉన్నట్లు తేలింది. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. ఐదిండ్లలో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు.’’
హైదరాబాద్, వెలుగు: పాత నేరస్తులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ పోలీసులతో సస్పెక్ట్ ఏరియాల్లో నిఘా కొనసాగిస్తున్నారు. క్రైమ్ రికార్డ్స్‌లోని అఫెండర్స్‌ను స్కాన్ చేస్తున్నారు. టీఎస్ పోలీస్ కాప్ యాప్, ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ డేటాతో ప్రాపర్టీ అఫెండర్స్, అంతరాష్ట్ర దొంగల కోసం సెర్చ్ చేస్తున్నారు. సిటీలోని రైల్వే స్టేషన్లు, బస్ట్ స్టేషన్స్, క్రైమ్స్ జరిగే అవకాశమున్న ఏరియాల్లో చెకింగ్లు నిర్వహిస్తున్నారు.
టీఎస్ కాప్ యాప్‌తో క్రిమినల్స్ డేటా
టీఎస్ కాప్ యాప్‌తో ఫేస్ ను బట్టి క్రిమినల్స్‌ను గుర్తిస్తున్నారు. సిటీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను టీఎస్ కాప్ యాప్‌తో కనెక్ట్ చేశారు. సస్పెక్ట్ఏరియాల్లో నిఘా పెట్టి మూడు కమిషనరేట్లలో ని బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ పోలీసులకు ట్యాబ్స్‌ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై తిరుగుతున్న వారి ఫొటోస్, ఫింగర్ ప్రింట్స్,ఆధార్ నంబర్, పూర్తి అడ్రస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ను ఫేషియల్ రికగ్నేషన్ యాప్‌తో స్కాన్ చేస్తున్నారు. ఓల్డ్ అఫెండర్స్ డేటా మ్యాచింగ్‌తో నేరస్తులను ఐడెంటీఫై చేస్తున్నారు.
డేటాతో సెర్చ్
దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల నేరగాళ్ళ డేటాను ఫేషియల్ రికగ్నేషన్ ల్యాబ్‌లో పొందుపర్చారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే తమ దగ్గరున్న ఫొటోలతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్, నేరస్తుల ఫొటోలతో మ్యాచ్ ఐతే అలాంటి వారి వివరాలు తీసుకుంటున్నారు. మళ్లీ నేరాలు చేశారా లేక సిటీలో తిరగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఇలా ఈ నెలలో ఇద్దరు ప్రాపర్టీ అఫెండర్స్, ఇద్దరు గంజాయి స్మగ్లర్స్‌ను అరెస్ట్ చేశారు. ట్యాబ్స్‌లోని డేటా ఆధారంగా యాకుత్‌పురాలో బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇద్దరు దొంగలను గుర్తించారు. స్థానిక పోలీసుకు సమాచారం అందించి అదుపులోకి తీసుకున్నారు
For More News..
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన
పంటలు కొనట్లేదని రైతులకు చెప్పండి
ఇది ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే..
మేయర్ సీటు కోసం లీడర్ల బిడ్డలు, కోడళ్ల లాబీయింగ్