గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలి : విశ్వహిందూ పరిషత్

  • డీజీపీని కోరిన వీహెచ్ పీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు

బషీర్​బాగ్, -వెలుగు: గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రతినిధి బృందం కోరింది. బక్రీద్ పండగ నేపథ్యంలో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని.. వారిని అడ్డుకుంటే తమ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని నేతలు శివరాములు, బాలస్వామి ఆరోపించారు.

ALSO READ:జులై 4న హైదరాబాద్​కు రాష్ట్రపతి ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్​ శాంతికుమారి ఆదేశాలు

ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు గోవుల అక్రమ తరలింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని తెలిపారు.