
రాయికల్, వెలుగు: రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామానికి చెందిన ఓ పశువుల కొట్టం ఆదివారం అగ్నిప్రమాదంలో కాలిపోయింది. భారతపు లక్ష్మీనర్సయ్యకు చెందిన పశువుల కొట్టానికి నిప్పంటుకొని పశుగ్రాసం, టేకు కలప, ట్రాక్టర్, హర్వెస్టర్ సామాగ్రి కాలిపోయింది. గ్రామస్తుల సమాచారంమేరకు ఫైర్‌సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పారు.