కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పశువుల అక్రమ రవాణా బయటపడింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రాజీవ్ రహదారిపై పశువులను తరలిస్తున్న డీసీఎం అతివేగంతో డివైడర్ ను ఢీకొంది. దీంతో డీసీఎం రహదారి పక్కన ఆగింది. ఈ డీసీఎం మహారాష్ట్రలోని కౌటాల నుంచి హైదరాబాద్ కు ఆవులు, ఎద్దులను తరలిస్తున్నట్లు బీజేవైఎం నాయకులు గుర్తించారు. గోవుల అక్రమ రవాణా అరికట్టేందుకు కఠన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పశువులు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.