వామ్మో : హైదరాబాద్ చుట్టూనే.. ఏడాదిలో 9 వేల పాములు పట్టివేత

రోజురోజుకు అటవి విస్తీర్ణం తగ్గిపోంది. దీంతో అడవుల్లో ఉండే వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి.  ఒక్క ఏడాది లోనే తెలంగాణలో10వేల పాములను పట్టుకున్నారంటే మీరు నమ్ముతారా ? అది కూడా ఓ స్వఛ్చ సంస్థ అయిన  ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FOSS). గవర్నమెంట్ రెస్క్యూ టీంలకు ఎన్ని పట్టుబడ్డాయో, చూసి చూడనట్టుగా ఎన్ని పాములు స్థానిక ప్రజల కంటపడ్డాయో? అయితే 2023 సంవత్సరంలో 10వేల 282 పాములను  రక్షించిందని FOSS ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథ్ తెలిపారు. 


ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FOSS) వన్యప్రాణులు, పాములను రక్షించి, వాటికి పునరావాసం కల్పింస్తోంది. వాటిని రాష్ట్ర అటవి శాఖ సహయంతో సురక్షితమైన అటవి ప్రాంతాలకు తరలిస్తారు. వీటిలో 95శాతం హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లోనే పట్టకున్నారట. ఎల్ బి నగర్, వనస్థలిపురం, అత్తాపూర్, గచ్చిబౌలి, నానక్ రామ్ గుడా, హైదరాబాద్ శివార్ల ప్రాంతాల నుంచి ఎక్కువగా రెస్క్యూ టీంలకు కాల్స్ వచ్చాయని వారు చెప్పారు. హైదరాబాద్ చుట్టు పక్కల సేకరించిన 40శాతం దాదాపు 4వేల పాములు విషపూరితమైనవని ఆ సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 4న కూడా హైదరాబాద్ లంగర్ హౌస్ పరిసరాల్లో 7 అడుగులు ఉన్న మూడు కొండ చిలువలను రక్షించింది.