Pushpa 2 Censor Certificate: టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప2: ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 05న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో సెన్సార్ పనులు పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేశారు.
ఈక్రమంలో సెన్సార్ సెర్టిఫికెట్ కోసం సినిమాని పంపించగా సీబీఎఫ్సి పుష్ప టీమ్ కి షాక్ ఇచ్చింది. ఇందులోభాగంగా పుష్ప 2 సినిమాలోని పలు అభ్యంతరకరమైన పదాలతో పాటూ సన్నివేశాలు కూడా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించింది. ఇందులో ముఖ్యంగా "రండి" అనే పదాన్ని పుష్ప2 సినిమాలో 01:21 నిడివి టైం లో 3సార్లు ఉపయోగించారని, కానీ ఈ పదానికి హిందీలో పరుష అర్థం వస్తుందని, మార్చాలని సూచించింది.
ALSO READ | డ్రగ్స్ బారినపడిన వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండంటూ అల్లు అర్జున్ వీడియో...
అలాగే తెలుగులో పలికే మరో అభ్యంతరకరమైన పదం కూడా ఉండటంతో మ్యూట్ చెయ్యాలని సూచించింది. 02:29 మినిట్స్ వద్ద వెంకటేశ్వర్ అనే పదాన్ని సబ్ టైటిల్స్ లో ఉపయోగించారని ఇది కూడా మార్చాలని తెలిపారు. ఇక విలన్ తో ఫైట్ సన్నివేశాలలో 3:05:20, 3:06:29 మినిట్స్ వద్ద ఎక్కువ హింసాత్మకంగా ఉన్నాయని కాబట్టి వీటిని కూడా తొలగించాలని సూచించారు. ఈ కట్స్ సజెస్ట్ చేసిన ఆనంతరం సెన్సార్ బోర్డ్ పుష్ప2 సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమనులతో పంచుకున్నాడు.
అయితే మొత్తం సినిమా దాదాపుగా 200.38 నిముషాలు ఉంది. దీన్నిబట్టి చూస్తే పుష్ప 2 సినిమా రన్ టైమ్ 3:20 గంటలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో టైటిల్స్, ఇంట్రో పార్ట్ దాదాపుగా 5 నిమిషాలకి పైగా ఉన్నట్లు సమాచారం. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో సెన్సార్, బీజియం విషయాల్లో సందిగ్దత నెలకొనడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
𝐔/𝐀 it is!! #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/jPZuMaRK56
— Allu Arjun (@alluarjun) November 28, 2024