
సేతురామ అయ్యర్ అనే సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్‌తో ఇప్పటికే నాలుగు సినిమాలు చేసిన మలయాళ స్టార్ మమ్ముట్టి, త్వరలో ఐదో పార్ట్‌తో రానున్నారు. ఈ మూవీ టైటిల్ రివీల్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్‌ను ఇటీవల లాంచ్ చేశారు. ‘సిబిఐ 5.. ద బ్రెయిన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక మోషన్ పోస్టర్‌లో ఐకానిక్ ఆఫీసర్ సేతురామ అయ్యర్ గెటప్‌లో కనిపించారు మమ్ముట్టి. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ స్టైల్‌లో ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆయనది. మలయాళంలో ఇప్పటికే పలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ వచ్చినప్పటికీ ‘సిబిఐ’ సిరీస్‌లో వచ్చే సినిమాలకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. గత నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసిన కె.మధు దీనికీ దర్శకుడు. నాలుగింటికీ స్క్రీన్ ప్లే రాసిన ఎస్.ఎన్ స్వామినే రైటర్. స్వర్గచిత్ర అప్పాచన్ నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.