కోల్‌కతా RG కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన CBI

కోల్‌కతా  RG కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన CBI

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో శనివారం సీబీఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది. RG కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అభిజిత్ మోండల్ లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 14న అరెస్ట్ చేసింది. కేసులో కీలక ఆధారాలు లభ్యమైయ్యాయి. కేసులో కంప్లెయింట్ చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ చేయడంలో వీరిద్దరూ జాప్యం చేశారని, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారని సమాచారం. సెప్టెంబర్ 15 (ఆదివారం) వీరిని కోర్టులో హాజరుపరుస్తూ ఈ కేసు వివరాలు సీబీఐ వెల్లడించనుంది.