CBI ఆపరేషన్ చక్ర : దేశవ్యాప్తంగా సైబర్ క్రిమినల్స్, నకిలీ కాల్ సెంటర్లపై దాడులు

CBI ఆపరేషన్ చక్ర : దేశవ్యాప్తంగా సైబర్ క్రిమినల్స్, నకిలీ కాల్ సెంటర్లపై దాడులు

సైబర్ క్రైం.. సైబర్ క్రిమినల్స్.. రోజురోజుకు పేట్రేగిపోతున్నారు.. వేల కోట్ల రూపాయలను ఓ లింక్ ద్వారా కొట్టేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో.. కేసుల పేరుతో.. వ్యాపారాలు, లాభాల పేరుతో.. ఇన్వెస్ట్ పేరుతో ఇలా ప్రతి రోజూ కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. ఈ క్రమంలోనే సైబర్ క్రిమినల్స్ పై.. సీబీఐ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకే దేశ వ్యాప్తంగా.. పలు నకిలీ కాల్ సెంటర్లపై దాడులు చేస్తుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సీబీఐ.. దీనికి ఆపరేషన్ చక్ర అనే పేరు పెట్టింది. 

దేశవ్యాప్తంగా హైదరాబాద్, విశాఖపట్నం, పూణె, అహ్మదాబాద్ సిటీల్లో నకిలీ కాల్ సెంటర్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి గుర్తించింది సీబీఐ. ఇందులో భాగంగా 2024, సెప్టెంబర్ 30వ తేదీ ఏకకాలంలో.. అన్ని నగరాల్లో దాడులు చేసింది. హైదరాబాద్ లోని విజేక్స్ సొల్యూషన్, విశాఖపట్నంలోని అట్ర్యియా గ్లోబల్ సర్వీస్, పూణెలోని వీసీ ఇన్ఫ్రా మెట్రిక్స్ కంపెనీల్లో తనిఖీలు చేసింది. అదే విధంగా అహ్మదాబాద్ లోనూ ఓ కాల్ సెంటర్ లో సోదాలు చేసింది సీబీఐ.

ఈ నాలుగు నగరాల్లో 170 మంది సైబర్ క్రిమినల్స్ పని చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది సీబీఐ. వీరిని అదుపులోకి తీసుకుని విచారించాలని డిసైడ్ అయ్యింది. ఆయా కంపెనీల్లో కీలక వ్యక్తులు.. యాజమాన్యం, పెట్టుబడిదారులను వివరాలు సేకరించింది సీబీఐ. విశాఖపట్నంలో 11 మంది, పూణెలో 10 మంది కోసం గాలిస్తు్న్నట్లు సీబీఐ చెబుతోంది. దేశవ్యాప్తంగా 32 చోట్ల సైబర్ నేరాలు జరుగుతున్నట్లు గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ఆపరేషన్ చక్ర పేరుతో సోదాలు చేస్తుంది సీబీఐ..