హైదరాబాద్ కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మపై కేసు నమోదు చేసింది. ఓ వ్యక్తి నుండి లంచం డిమాండ్ చేశారు జీఎస్టీ అధికారులు. దీంతో సీబీఐని ఆశ్రయించాడు బాధితుడు.
ఐరన్ స్క్రాప్ గోదాంలో అక్రమాలపై ఫైన్ విధించారు జీఎస్టీ అధికారులు . బాధితుడు నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు జీఎస్టీ అధికారులు. స్ర్కాప్ గోదామును సీజ్ చేశారు . సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు జీఎస్టీ అధికారులు. దీంతో సీబీఐని ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన .. రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుంది.