
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 2024 మే17 నుండి జూన్ 1 వరకు తన కుటుంబ సమేతంగా కలిసి లండన్ కు వెళ్లనున్నారు జగన్. నిన్నటితో ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ప్రచారంలో బిజీబిజీగా గడిపిన జగన్.. కుటుంబంతో కలిసి లండన్ కు వెళ్లి రిలాక్స్ కానున్నారు. ఎన్నికల పోలింగ్‌కి ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండటంతో జగన్ విదేశీ పర్యటన ప్లాన్ చేసుకున్నారు. జూన్ 1న తిరిగి ఏపీకి రానున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా సీఎం జగన్‌పై ఆస్తుల కేసులు ఉన్నాయి.. ఆయనకు సీబీఐ కోర్టు షరుతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ షరతుల ప్రకారం జగన్ దేశం విడిచి వెళ్లరాదు. అందుకే లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.